కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు టాలీవుడ్ నడుం బిగించింది. ఇందుకోసం సంగీత దర్శకుడు కోటి ఓ ప్రత్యేక గీతాన్ని ట్యూన్ చేయగా.. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఆలపించారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ... వైరస్ నిర్మూలనకు చేయాల్సిన కృషిని పాట రూపంలో ప్రేక్షకులకు రూపొందించారు. అంతేకాకుండా ఆ పాటను పాడి, రికార్డ్ చేసి ఆ వీడియోను పంపమని చిరంజీవి నెటిజన్లను ట్వీటర్‌లో కోరారు. (సాయం సమయం)
అలాగే కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడింది. 21రోజుల పాటు లాక్‌డౌన్ నేపథ్యంలో దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషికి హీరోలు, నిర్మాతలు, దర్శకులు తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే సినిమా షూటింగ్‌లు కూడా ఆగిపోవడంతో పలువురు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ‘సీసీసీ మనకోసం’ (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థకి చైర్మన్‌గా చిరంజీవి ఉన్నారు. ఇప్పటికే పలువురు నటులు సీసీసీకి విరాళాలు ప్రకటించగా.. తాజాగా హీరో ప్రభాస్ రూ.50 లక్షలు, నటుడు బ్రహ్మాజీ రూ.75 వేలు విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. (కరోనా లాక్డౌన్: చిరు బాటలో నాగ్)
Comments
Please login to add a commentAdd a comment