కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రభావం వల్ల బాలీవుడ్‌లో సినిమాలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి రణ్‌వీర్‌సింగ్ ‘83’ మూవీ కూడా చేరింది. 1983లో భారతజట్టు మొదటిసారి క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన మధుర సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రానికి కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ పాత్రలో నటించారు రణ్‌వీర్ సింగ్. అలాగే కపిల్‌దేవ్ భార్య రోమీగా నటించారు రణ్‌వీర్ సింగ్ భార్య దీపికాపదుకోన్. ‘83’ సినిమాను తొలుత ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు.
కోవిడ్ 19 ప్రభావంతో విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ నోట్‌ను విడుదల చేశారు రణ్‌వీర్‌సింగ్. ‘‘మనందరి ఆరోగ్యాలకు కోవిడ్ 19 సృష్టిస్తున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ‘83’ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం. పరిస్థితులు చక్కబడిన తరువాత సినిమా విడుదల గురించి ప్రకటిస్తాం. ‘83’ అనేది భారతీయులందరి సినిమా. ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం’’ అని పేర్కొన్నారు చిత్రబృందం.
వెనక్కి తగ్గిన కూలీ?
వరుణ్ ధావన్, సారా అలీఖాన్ జంటగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కూలీ నెం 1’. 1995లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘కూలీ నెం 1’ చిత్రానికి ఇది తాజా రీమేక్. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. తొలుత ఈ సినిమాను కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేయడానికి నిర్ణయించారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా విడుదలను వాయిదా వేయాలనుకుంటున్నారు. వరుణ్ ధావన్ నటించిన గత రెండు చిత్రాలు ‘కళంక్, స్ట్రీట్ డ్యాన్సర్ 3’లకు బాక్సాఫీస్ వద్ద సరైన స్పందన రాలేదు. ‘కూలీ నెం 1’ వరుణ్ సొంత బేనర్‌లో రూపొందింది. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత విడుదల చేస్తే కలెక్షన్స్ బాగుంటాయని వరుణ్ భావిస్తున్నారట. అందుకని ‘కూలీ’ విడుదల మే తర్వాతే అని బాలీవుడ్ టాక్.
వరుణ్ ధావన్, సారా అలీఖాన్
ఆట వాయిదా
Published Sat, Mar 21 2020 5:19 AM | Last Updated on Sat, Mar 21 2020 5:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment