
క్వారంటైన్ సమయాన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు స్టార్స్. కొంత మంది అసలు తెలియని పనులను నేర్చుకుంటున్నారు. మరికొందరు వాళ్లకు తెలిసిన పనిలో మరింత పదును పెంచుకుంటున్నారు. సమంత కూడా అదే పని చేస్తున్నారు. ఇండ్రస్టీకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న సమంత ఇప్పుడు ఆన్ లైన్లో యాక్టింగ్ క్లాస్ జాయిన్ అయ్యారు. యాక్టింగ్ లో మెళకువలు నేర్చుకుంటున్నారట. నటనని మరింత మెరుగుపరుచుకుంటున్నారట. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియజేశారు. ‘‘ఈ లాక్ డౌన్ పూర్తయ్యే సరికి నేనింకా బెటర్ యాక్టర్‌ని అవుతానని అనుకుంటున్నాను. ఒకవేళ కాలేదనుకోండి అప్పుడు ఈ పోస్ట్‌ని డిలిట్ చేస్తాను’’ అని సరదాగా పేర్కొన్నారు సమంత. చదవండి: అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం
Comments
Please login to add a commentAdd a comment