హాలీవుడ్ ఛాన్స్ వదులుకున్న దీపిక
బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హాలీవుడ్లో అరంగ్రేటం చేసే అవకాశాన్ని వదులుకుంది. ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘విన్ డీసెల్ ఫ్రాంచైజ్’ నిర్మిస్తున్న ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్-7’ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా అందుకోలేకపోయింది. డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆమె హాలీవుడ్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్-7’ సినిమాలో నటించడం ఖాయమని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది.
ఈనెల 10 నుంచి డేట్స్ కావాలని నిర్మాతలు అడిగారు. అయితే ప్రస్తుతం షారూఖ్ ఖాన్తో ' హ్యేపీ న్యూ ఇయర్' సినిమాలో దీపిక నటిస్తోంది. అంతేకాకుండా సంజయ్లీలా భన్సాలీ 'రామ్ లీలా' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సివుంది. దీంతో ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్-7’ అవకాశాన్ని వదులుకుంది. దీపిక పదుకొనే హాలీవుడ్ అవకాశం వదులుకోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు.