మాంగల్యం @ 20 లక్షలు | Deepika Padukone wedding jewellery purchase | Sakshi
Sakshi News home page

మాంగల్యం @ 20 లక్షలు

Published Mon, Nov 5 2018 2:05 AM | Last Updated on Mon, Nov 5 2018 2:05 AM

Deepika Padukone wedding jewellery purchase - Sakshi

రణ్‌వీర్‌సింగ్‌, దీపికా పదుకోన్‌

పట్టుమని పది రోజులు కూడా లేవు దీప్‌వీర్‌(దీపికా పదుకోన్‌–రణ్‌వీర్‌సింగ్‌)వివాహం జరగడానికి. అందుకే పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే దీపిక ఇటీవల ముంబైలోని ఓ నగల దుకాణానికి వెళ్లి షాపింగ్‌ చేశారు. 20 లక్షల రూపాయల విలువైన మంగళ సూత్రంతో పాటు, కాబోయే భర్త రణ్‌వీర్‌సింగ్‌కి ఓ చైన్‌ కూడా కొన్నారని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఆ రోజు దీపిక షాపింగ్‌ చేసి, దాదాపు కోటిరూపాయల విలువైన నగలను కొన్నారట. ఇంకా తనకు సూట్‌ అయ్యే మరికొన్ని నగల డిజైన్స్‌ను ఆమె పరిశీలించుకుంటున్నారని టాక్‌. ఇంకో గమ్మల్తైన విషయం ఏంటంటే... దీపిక షాపింగ్‌కు వస్తున్నారని ముందుస్తు సమాచారం అందుకున్న ఆ నగల దుకాణ నిర్వాహకులు ఒక గంట ముందుగానే షాప్‌ క్లోజ్‌ చేస్తున్నట్లు ప్రకటించి, కేవలం దీపిక మాత్రమే షాపింగ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారట. దీప్‌వీర్‌ల వివాహం ఈ నెల 14,15 తేదీల్లో జరగనుందని తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement