దీపికా, రణ్‌వీర్‌ పెళ్లిపై కరణ్‌ జోహార్‌.. | Karan Johar Signaled ON Deepika Padukone And Ranveer Singhs wedding | Sakshi
Sakshi News home page

దీపికా, రణ్‌వీర్‌ పెళ్లిపై కరణ్‌ జోహార్‌..

Published Wed, Sep 12 2018 3:29 PM | Last Updated on Wed, Sep 12 2018 5:37 PM

Karan Johar Signaled ON Deepika Padukone And Ranveer Singhs wedding - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్‌ తర్వాత బాలీవుడ్‌ కళ్లన్నీ దీపికా పడుకోన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ల వివాహంపైనే కేంద్రీకృతమయ్యాయి. వీరి ప్రేమ, పెళ్లి వ్యవహారం ఎప్పటినుంచో హాట్‌ టాపిక్‌గా ఉన్న నవంబర్‌లో వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటవుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను వైభవంగా నిర్వహిస్తారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నా వీరిద్దరూ ధృవీకరించలేదు.

అయితే ఈ ఏడాది నవంబర్‌లో వీరి వివాహం జరగనుందనే వార్తలపై ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ స్పందన ఆసక్తికరంగా మారింది. ఓ షోలో రేడియో జాకీగా అవతారమెత్తిన కరణ్‌ జోహార్‌కు రాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పడుకోన్‌ల వివాహం త్వరలో జరగనుందనే వార్తలను అంగీకరిస్తారా, తోసిపుచ్చుతారా అనే ప్రశ్న ఎదురవగా, వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే వార్తను నిరాకరించనని స్పష్టం చేశారు. కరణ్‌ జోహార్‌ సంకేతాలతో దీపికా, రణ్‌వీర్‌సింగ్‌లు త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతారని అభిమానులు ఆశిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement