'గులాబ్ గ్యాంగ్'కు తొలిగిన ఇబ్బందులు, రేపు విడుదల
మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా నటించిన గులాబ్ గ్యాంగ్ చిత్ర విడుదలకు అడ్డంకులు తొలిగాయి. గులాబ్ గ్యాంగ్ చిత్ర విడుదలపై ఉన్న స్టే ను ఢిల్లీ హైకోర్టు ఎత్తివేయడంతో శుక్రవారం (మే 8 తేదిన) విడుదల కానుంది.
గురువారం ఉదయం గులాబ్ గ్యాంగ్ చిత్ర నిర్మాతలు విడుదలపై విధించిన స్టే తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాతల పిటిషన్ కు సానుకూలంగా స్పందించిన కోర్టు.. మధ్నాహ్నం విచారణ చేపట్టింది. నిర్మాతల పిటిషన్ పై వాదోపవాదనలు విన్న కోర్టు విడుదలపై ఉన్నస్టే ను ఎత్తి వేసింది. దాంతో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.