
తమిళ నాట మాస్ హీరోగా మంచి క్రేజ్ ఉన్న హీరో ధనుష్. తీసే ప్రతి సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా చూసుకునే ధనుష్‌కు భారీగానే ఫాలోయింగ్ ఉంది. రఘువరన్ బీటెక్ సినిమాతో ధనుష్ తెలుగులో కూడా పాపులర్ అయ్యాడు. కాజల్ అగర్వాల్, ధనుష్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన మారి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అయితే ప్రస్తుతం మారికి సీక్వెల్ రాబోతోంది. మరోసారి మాస్ ఎలిమెంట్స్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు ధనుష్ సిద్దమయ్యాడు. తాజాగా ఈ సినిమా నుంచి ధనుష్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘మారి’ని తెరకెక్కించిన బాలాజీ మోహన్ దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ కూడా రాబోతోంది. సాయి పల్లవి, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
The naughtiest don is back. #Maari2FirstLook#Maari2 #tharalocal #senjuruven pic.twitter.com/i4NdjhiX54
— Dhanush (@dhanushkraja) November 2, 2018