తెలుగు, తమిళ భాషల్లో ధనుష్ కొత్త సినిమా | Dhanushs Maari sequel to be made as bilingual | Sakshi
Sakshi News home page

తెలుగు, తమిళ భాషల్లో ధనుష్ కొత్త సినిమా

Published Thu, Sep 28 2017 2:37 PM | Last Updated on Thu, Sep 28 2017 3:03 PM

Dhanushs Maari sequel to be made as bilingual

సాక్షి, చెన్నై: ధనుష్‌ హీరోగా తమిళంలో సూపర్‌హిట్‌ అయిన మారి సినిమాకు సీక్వెల్‌ ను తెరకెక్కించనున్నారు. అయితే ఈసారి సినిమాను తెలుగులోనూ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మారి తొలి భాగానికి దర్శకత్వం వహించిన దర్శకుడు బాలాజీ మోహన్‌ సీక్వల్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు.

మారి సినిమాలో ధనుష్‌ పంచెకట్టు, మెలితిరిగిన మీసాలతో ఉండే రౌడీ పాత్ర పోషించారు. అయితే, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ స్థానంలో మరో హీరోయిన్‌ రాబోతున్నారని డైరెక్టర్‌ బాలాజీ మోహన్‌ ట్వీట్‌ చేశారు. మారిలో కీలక పాత్రలు పోషించిన రోబో శంకర్‌, వినోద్‌ ఈ సినిమాలో కూడా ఉంటారని వెల్లడించారు. అక్టోబర్‌లో షూటింగ్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సినిమాలో విలన్‌గా మళయాళం నటుడు టొవినో థామస్‌ నటించనున్నారు. తరంగం, మారడోనా సినిమాల తర్వాత ధనుష్‌తో చేయనున్న మూడో సినిమా ఇది అని బాలాజీ మోహన్‌ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement