మీసం మెలేసిన మారి | Dhanush wraps up Maari 2 and is already planning Maari 3 | Sakshi
Sakshi News home page

మీసం మెలేసిన మారి

Published Tue, Aug 14 2018 1:02 AM | Last Updated on Tue, Aug 14 2018 1:02 AM

Dhanush wraps up Maari 2 and is already planning Maari 3 - Sakshi

ధనుష్, బాలాజీ మోహన్‌

గుమ్మడికాయ కొట్టి మీసం మెలేశారు మారి అండ్‌ గ్యాంగ్‌. ‘మారి 2’ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ కావడమే వాళ్ల సంతోషానికి కారణం. ధనుష్‌ హీరోగా బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మారి 2’. ధనుష్, బాలాజీ మోహన్‌ కాంబినేషన్‌లోనే 2015లో వచ్చిన ‘మారి’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, విద్యా ప్రదీప్‌ కీలక పాత్రలు చేశారు. ‘‘మళ్లీ మారిగా నటించడం ఆనందంగా ఉంది. సెట్‌లో బాగా ఎంజాయ్‌ చేశా. షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం’’ అని పేర్కొన్నారు ధనుష్‌. ‘‘సిల్వర్‌ స్క్రీన్‌పైకి మారి మళ్లీ వస్తున్నాడు. ఫన్నీగా షూటింగ్‌ గడిచిపోయింది. మారిని మిస్‌ అవుతున్నాం’’ అన్నారు దర్శకుడు బాలాజీ మోహన్‌. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement