నేను బాగానే ఉన్నా | 'I'm Well,' Tweets Dhanush After Injury Reportedly On Sets Of Maari 2 | Sakshi
Sakshi News home page

నేను బాగానే ఉన్నా

Published Sun, Jun 24 2018 12:34 AM | Last Updated on Sun, Jun 24 2018 12:34 AM

'I'm Well,' Tweets Dhanush After Injury Reportedly On Sets Of Maari 2 - Sakshi

ధనుష్‌

కోలీవుడ్‌లో ఒకటే హాట్‌ టాపిక్‌.. దర్శక, నిర్మాత–నటుడు ధనుష్‌ గాయపడ్డారని. దాంతో ఆయన ఫ్యాన్స్‌ హైరానా పడిపోయారు. కానీ కంగారు పడాల్సినంత దెబ్బ ఏమీ తగలలేదని ధనుష్‌ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్‌ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మారి 2’.

సాయిపల్లవి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘మారి’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. ప్రస్తుతం ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తున్నారు. ఈ షూట్‌లోనే ఓ స్టంట్‌ చేయబోయి ధనుష్‌ గాయపడ్డారట. ఈ విషయంపై ధనుష్‌ క్లారిటీ ఇస్తూ– ‘‘నేను బాగానే ఉన్నాను. పెద్దగా గాయాలేమీ తగల్లేదు. మీ అభిమానమే నా బలం. మీ ఆత్మీయతకు రుణపడి ఉంటా’’ అని ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. ‘మారి 2’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement