రెండు రోజుల్లోపే కోటికి పైగా వ్యూస్‌..! | Dhanush And Sai Pallavi Rowdy Baby Song Creates records in Youtube | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 4 2019 2:49 PM | Last Updated on Fri, Jan 4 2019 3:17 PM

Dhanush And Sai Pallavi Rowdy Baby Song Creates records in Youtube - Sakshi

కత్రినా కైఫ్‌ కాలా చష్మా సాంగ్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో అది సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఈ పాటను యూట్యూబ్‌లో 545మిలియన్ల మంది వీక్షించారు. దేశం మొత్తాన్ని ఈ పాట ఒక ఊపు ఊపేసింది. సౌత్‌ నుంచి కొలవెరీ సాంగ్‌ అందరి నోట ఎలా వినపడిందో మళ్లీ ఇప్పుడు అలాంటి ఓ పాటే రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ వీడియో సాంగ్‌లో ధనుష్‌, సాయి పల్లవి చేసిన మ్యాజిక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

ఇటీవలె రిలీజైన మారి2 సినిమాలోని రౌడీ బేబీ సాంగ్‌ సోషల్‌ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటలో సాయి పల్లవి డ్యాన్సులు, హావభావాలు ఫ్యాన్స్‌కు మతిపోగొడుతున్నాయి. వీడియో సాంగ్‌ను విడుదల చేసి 48గంటలు గడవకముందే ఈ పాటను కోటికి పైగా వీక్షించారు. నవంబర్‌లో విడుదల చేసిన లిరికల్‌ సాంగ్‌ను ఇప్పటివరకు 5కోట్లకుపైగానే చూశారు. ధనుష్‌ ఈ పాటను రాయగా.. ధీ, ధనుష్‌ కలిసి ఈ పాటను ఆలపించారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన బాణీ కూడా క్యాచీగా ఉంది. ఇక ఈ పాటకు ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. మీరు కూడా ఓసారి ఈ వీడియో సాంగ్‌ను చూసి ఎంజాయ్‌ చేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement