డిఫరెంట్ స్టోరీ! | Different Story | Sakshi
Sakshi News home page

డిఫరెంట్ స్టోరీ!

Published Thu, Oct 8 2015 11:18 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

డిఫరెంట్ స్టోరీ!

డిఫరెంట్ స్టోరీ!

 ‘నాన్నా నాకు ట్రైన్ ఏది..’ అంటూ ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం దగ్గర ఓ బుడతడు ముద్దు ముద్దుగా అడుగుతాడు గుర్తుందా? పోనీ.. ‘లెజెండ్’లో బాలకృష్ణ యుక్తవయసు పాత్ర పోషించిన కుర్రాడు గుర్తున్నాడా? ‘మిణుగురులు’లో లీడ్ రోల్ కూడా చేశాడు. ఆ మధ్య విడుదలైన ‘టామీ’లో రాజేంద్రప్రసాద్ అల్లుడుగా కూడా నటించాడు. ఈ పాత్రలు చేసిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరో అయిపోయాడు. ‘‘బాలనటుడిగా 40 చిత్రాలకు పైగా చేశాను. వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. ‘వందనం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాను. ఓ డిఫరెంట్ స్టోరీతో ఈ చిత్రం సాగుతుంది’’ అని దీపక్ సరోజ్ తెలిపారు. కోటపాటి శ్రీను దర్శకత్వంలో కందిమళ్ల వెంకట చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మీనన్ కథానాయిక.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement