చెత్త సినిమా పోటీలో ఆ రెండు చిత్రాలు! | Dilwale, PRDP vying for worst film award at 8th Annual Golden Kela Awards | Sakshi
Sakshi News home page

చెత్త సినిమా పోటీలో ఆ రెండు చిత్రాలు!

Published Fri, Mar 4 2016 10:14 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM

చెత్త సినిమా పోటీలో ఆ రెండు చిత్రాలు! - Sakshi

చెత్త సినిమా పోటీలో ఆ రెండు చిత్రాలు!

న్యూఢిల్లీ: ప్రతి ఏడాది వచ్చే ఉత్తమ సినిమాలకే కాదు.. అత్యంత చెత్త సినిమాలకు కూడా పురస్కారాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏర్పాటైనవే గోల్డెన్ కేలా అవార్డ్స్‌. ఈ ఏడాది గోల్డెన్ కేలా అవార్డుల కోసం ఊహించనివిధంగా ఇద్దరు సూపర్‌ స్టార్ చిత్రాలు పోటీ పడుతుండటం గమనార్హం. బాలీవుడ్‌లో గత ఏడాది విడుదలైన అత్యంత చెత్త సినిమా అవార్డు కేటగిరీలో సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో', షారుఖ్‌ ఖాన్‌ చిత్రం 'దిల్‌వాలే' హోరాహోరీగా పోటీపడుతున్నాయి.

నిజానికి ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద వంచి వసూళ్లే రాబట్టాయి. వందకోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. అయితే దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ జత కట్టిన షారుఖ్‌-కాజోల్‌ జోడీ 'దిల్‌వాలే'లో తమ మ్యాజిక్‌ను పునరావృతం చేయలేకపోయింది. మరోవైపు 'మైనే ప్యార్ కియా' దర్శకుడు సూరజ్ బర్జాత్యా సల్మాన్‌ ను డబుల్‌ రోల్‌ చూపించిన 'ప్రేమ్ రతన్ ధన్‌ పాయో' కూడా పెద్దగా ప్రేక్షకుల మనుసు గెలుచుకోలేకపోయింది. ఈ రెండు సినిమాలతో పాటు అర్జున్ కపూర్‌ 'తెవర్', అక్షయ్‌ కుమార్ 'సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌' కూడా చెత్త సినిమా అవార్డుకు పోటీపడుతున్నాయి. ఈ సినిమాలకు ఇప్పటివరకు అత్యధిక నామినేషన్లు దక్కాయి. ఈ నెల 30 వరకు గోల్డెన్‌కేలా.కామ్‌ లో ఓటింగ్‌ తెరిచి ఉంటుంది.

ఇక చెత్త నటుల అవార్డు కేటగిరీలో ఈ సారి అన్నా-చెల్లెలు పోటీపడుతుండటం గమనార్హం. అన్న అర్జున్ కపూర్ 'తెవర్' సినిమా కోసం చెత్త హీరోగా.. చెల్లి సోనం కపూర్ 'ప్రేమ్ రతన్ ధన్‌ పాయో' సినిమా కోసం చెత్త హీరోయిన్‌గా అవార్డు రేసులో ముందున్నారు. చెత్త నటుడి కేటగిరీలో ఇంకా అర్జున్ రాంపాల్ (రాయ్‌), సూరజ్ పంచోలీ (హీరో), ఇమ్రాన్ ఖాన్ (కట్టిబట్టి) తదితరులు.. చెత్త నటి కేటగిరీలో సోనాక్షి సిన్హా (తెవర్), శ్రద్ధ కపూర్ (ఏబీసీడీ2), ఆమీ జాక్సన్ (సింగ్ ఈజ్ బ్లింగ్) రేసులో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement