పూరి దర్శకత్వంలో కల్యాణ్ రామ్! | Directed by Puri Kalyan Ram! | Sakshi
Sakshi News home page

పూరి దర్శకత్వంలో కల్యాణ్ రామ్!

Published Wed, Feb 3 2016 10:38 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

పూరి దర్శకత్వంలో  కల్యాణ్ రామ్! - Sakshi

పూరి దర్శకత్వంలో కల్యాణ్ రామ్!

 పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ఓ చిత్రం రూపొందనుందనే వార్తను ఎవరూ ఊహించరు. నిజంగా ఇది క్రేజీ కాంబినేషనే. కల్యాణ్ రామ్ కోసం పూరి జగన్నాథ్ అద్భుతమైన కథ తయారు చేశారట. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ నిర్మించనున్నారు.

ఆ మధ్య కల్యాణ్ రామ్ నటించి, నిర్మించిన ‘పటాస్’ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రవిజయం నిర్మాతగా, హీరోగా కల్యాణ్ రామ్ స్థాయిని పెంచింది. ఇప్పుడు పూరీతో చేయనున్న చిత్రం ఇంకా రేంజ్ పెంచే విధంగా ఉంటుందట. భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూరి జగన్నాథ్ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు సమకూర్చి, దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్‌లో ఆరంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement