దర్శకుడు నాగేంద్రప్రసాద్ గిన్నిస్ రికార్డు మొదటి రోజు
‘స్క్రిప్ట్ టు స్క్రీన్’ కాన్సెప్ట్‌తో దర్శకుడు నాగేంద్రప్రసాద్ 10 రోజుల్లో సినిమా తీసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించే బృహత్తర ప్రయత్నం సోమవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు మొదలైంది. ప్రముఖ న్యాయవాది బి. పరమేశ్వరరావు విజిల్ ఊది ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
తొలి రోజు ఏమేం జరిగాయంటే...
* కాన్సెప్ట్ ఖరారైంది. స్క్రిప్ట్ సింగిల్‌లైన్ ఆర్డర్ సిద్ధమైంది.
* ప్రధాన సాంకేతిక నిపుణుల్లో కొంతమందిని ఎంపిక చేసుకున్నారు.
* రాఘవ నూలేటి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం చేయనున్నారు.
* ‘సాక్షి’లో ఇంటర్వ్యూ చదివి దర్శకుణ్ణి అభినందించడానికి సంగీత దర్శకుడు సుమన్ జూపూడి ఫోన్ చేశారు. ఆ సమయంలోనే ఈ చిత్రానికి స్వరాలందించే అవకాశం ఇచ్చారు.
* నాగేంద్రప్రసాద్ దగ్గర గతంలో ‘కీ’ చిత్రానికి పనిచేసిన పవిత్రమ్ కోడెరైక్టర్‌గా చేరారు.
* ఎడిటర్‌గా శివ వై. ప్రసాద్ ఎంపికయ్యారు.
* స్క్రిప్ట్‌ను మరింత మెరుగు పెట్టే విధంగా చర్చలు జరిగాయి.
* లొకేషన్ల గురించి కూడా చర్చ జరిగింది.
* ఫేస్‌బుక్ పేజ్ ద్వారా ఆర్టిస్టులను ఆహ్వానించే ప్రక్రియ మొదలుపెట్టారు.
నేను కెమేరామేన్‌గా కొన్ని చిత్రాలకు పనిచేశాను. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్న ‘బందిపోటు’ సినిమాకు ఆపరేటివ్ కెమేరామేన్‌గా పని చేస్తున్నాను. ఈ రికార్డ్ అంటెప్ట్ మూవీకి వర్క్ చేయాలన్న ఆసక్తితో మా గురువు పీజీ విందా దగ్గర అనుమతి తీసుకుని ఈ టీమ్‌తో జాయిన్ అయ్యాను.
- రాఘవ నూలేటి,
కెమేరామేన్