స్క్రిప్ట్‌ వర్క్‌@అమెరికా! | Director Vamsi Paidipally arranges to go to the United States with a group of writers | Sakshi
Sakshi News home page

స్క్రిప్ట్‌ వర్క్‌@అమెరికా!

Published Thu, Jul 6 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

స్క్రిప్ట్‌ వర్క్‌@అమెరికా!

స్క్రిప్ట్‌ వర్క్‌@అమెరికా!

రోమ్‌లో రోమన్‌లా నడుచుకోవాలంటారు. అమెరికాలో? అమెరికన్‌లా నడుచుకోవాలి! మరి, అమెరికన్‌లా ఆలోచించాలంటే? అమెరికన్‌ ఎన్నారైలా నడుచుకోవాలంటే? కొన్నాళ్లు అమెరికాలో ఉండాలి. అమెరికన్స్‌ని అబ్జర్వ్‌ చేయాలి. అందుకే, మహేశ్‌బాబు కొత్త సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి ఆగస్టులో రచయితల బృందంతో అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట!

మహేశ్‌ హీరోగా నటించనున్న 25వ సిన్మాకు వంశీ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో సి. అశ్వినీదత్, ‘దిల్‌’ రాజు నిర్మించనున్న ఈ సినిమా కథ అమెరికా నేపథ్యంలో సాగుతుంది. ఆగస్టులో అమెరికా వెళ్లనున్న దర్శకుడు వంశీ పైడిపల్లి అక్కడే స్క్రిప్ట్‌ వర్క్‌ను కంప్లీట్‌ చేయడంతో పాటు లొకేషన్స్‌ ఫైనలైజ్‌ చేస్తారట. ప్రస్తుతం మహేశ్‌ నటిస్తున్న ఏఆర్‌ మురుగదాస్‌ ‘స్పైడర్‌’ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. మహేశ్‌ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘భరత్‌ అను నేను’ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement