కమల్‌తో డిష్యూం..డిష్యూం! | Disyum disyum with Kamal! | Sakshi
Sakshi News home page

కమల్‌తో డిష్యూం..డిష్యూం!

Published Wed, Aug 19 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

కమల్‌తో డిష్యూం..డిష్యూం!

కమల్‌తో డిష్యూం..డిష్యూం!

ఓ రెస్టారెంట్‌లోని వంట గదిలో కమల్‌హాసన్, త్రిష విపరీతంగా ఫైట్ చేసుకుంటున్నారు. అక్కడి సామానంతా చెల్లాచెదురు చేస్తున్నారు. ఒకరి మొహం మీద ఒకరు పంచ్‌లు విసురుకుంటున్నారు. రక్తాలు కారుతున్నా, వారిద్దరూ ఆగట్లేదు. అంతలో దర్శకుడు కట్... కట్... అన్నాడు. ఈ సన్నివేశాన్ని  ‘చీకటి రాజ్యం’ చిత్రం కోసం ఇటీవలే చిత్రీకరించారు.
 
 ఈ సీన్ ఇప్పటికీ తనను హాంట్ చేస్తోందని త్రిష చెబుతున్నారు. కమల్‌తో అలా ఫైట్ చేయడం ఆమెకు గమ్మత్తుగా అనిపించిందట. అది కూడా ఫ్రెంచ్ ఫైట్‌మాస్టర్స్ ఆధ్వర్యంలో రియలిస్టిక్‌గా చిత్రీకరించారట. రాజేశ్ ఎమ్. సెల్వా దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రకాశ్‌రాజ్ ఇందులో ముఖ్యపాత్రధారి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement