ఇలా చెప్పాలి త్రిషా...! | Trisha say it...! | Sakshi
Sakshi News home page

ఇలా చెప్పాలి త్రిషా...!

Published Thu, Aug 13 2015 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

ఇలా చెప్పాలి త్రిషా...!

ఇలా చెప్పాలి త్రిషా...!

‘మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్’ అని ఆమిర్‌ఖాన్‌ని అంటారు కానీ, కమల్‌హాసన్ అంతకన్నా ఎక్కువే. మాట, పాట... డ్యాన్స్, ఫైట్... ఎమోషన్, కామెడీ.. అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారాయన. అందుకే తనేంటో తన పనేంటో అన్నట్లు కాకుండా.. వీలైనంతవరకు అన్ని శాఖల్లోనూ ఇన్‌వాల్వ్ అయ్యి, సినిమా చేస్తారు కమల్.
 
 ఆయన నటించిన తాజా చిత్రం ‘చీకటి రాజ్యం’ విడుదలకు సిద్ధమవుతోంది. రాజేశ్ ఎం. సెల్వ దర్శకత్వంలో ఎన్. చంద్రహాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కమల్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడంతో పాటు దగ్గరుండి మరీ చిత్రకథానాయిక త్రిషతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. త్రిష మాతృభాష తమిళ్ అయినా ఆమె డబ్బింగ్ చెప్పరు.
 
  ఇప్పటి వరకూ రెండు, మూడు సినిమాలకు చెప్పి ఉంటారేమో. ఇప్పుడు కమల్ ఆధ్వర్యంలో ‘చీకటి రాజ్యం’ తమిళ వెర్షన్ ‘తూంగానగరమ్’కి డబ్బింగ్ చెబుతున్నారామె. ‘ఇలా చెప్పాలి త్రిషా’ అని కమల్ దగ్గరుండి మరీ తనతో డబ్బింగ్ చెప్పించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement