కమల్ పాత్రలో త్రిష | Kamal Hassan role in Trisha | Sakshi
Sakshi News home page

కమల్ పాత్రలో త్రిష

Published Sun, Apr 5 2015 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

కమల్ పాత్రలో త్రిష

కమల్ పాత్రలో త్రిష

 విశ్వనాయకుడు కమల్ పోషించిన పాత్రలో అందాలగుమ్మ త్రిష నటించనున్నారు. ఏమిటి నమ్మశక్యంగా లేదా? లేక ఏమిటి త్రిష సాహసం అని ఆశ్చర్యపోతున్నారా? మీరెలాంటి విస్మయాన్ని వ్యక్తం చేసినా కమలహాసన్ పోషించిన రెండు పాత్రల్లో త్రిష నటించనున్నారన్నది నిజం. ఇది ఆమెకు కత్తి మీద సాము లాంటిదే అయినా ఆమె తన ప్రయత్నం తాను చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే కమలహాసన్ రెండు వైవిధ్యభరిత పాత్రల్లో నటించిన చిత్రం కల్యాణరామన్.
 
  ఇందులో ఒకటి వయసు పెరిగినా మనసు పరిణితి చెందని పాత్ర. ఈ పాత్ర దురాశపరుల దారుణానికి బలై ఆత్మగా సంచరిస్తుంది. నటి శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 1979లో విడుదలై ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తే కమల్ పాత్రలో ఎవరిని నటింపచేయాలన్న విషయమై కోలీవుడ్‌లో పెద్ద చర్చనే జరిగింది. అయినా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అలాంటి పాత్రలో నటుడు కాదు నటి నటించడానికి సాహసం చేస్తున్నారు.
 
  ఆమె ఎవరో కాదు ఇటీవల వివాహానికి సిద్ధం అయిన నిశ్చితార్థం కూడా జరుపుకున్న సంచలనతార త్రిషనే. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తమిళంలో విజయం సాధించిన మౌనగురు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఆ చిత్రంలో హీరో పాత్రను హీరోయిన్‌గా మార్చి సోనాక్షిసిన్హాను నటింప చేస్తున్నారు. అదే విధంగా కల్యాణరామన్ చిత్రంలో కమలహాసన్ పాత్రల్ని హీరోయిన్ల పాత్రలుగా చేసి అక్కాచెల్లెళ్ల పాత్రలో నటి త్రిషను నటింప చేస్తున్నారు. ఆమె మేనేజర్ గిరిధర్ చాలా కాలంగా తనకు మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన కోసం త్రిష ఈ చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement