Rajesh M. Selva
-
తొలి అడుగు
ఇటు సౌత్.. అటు నార్త్.. కాస్త ఖాళీ దొరికితే డిజిటల్ వరల్డ్... ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటున్నారు హీరోయిన్ అదితీరావ్ హైదరి. అయితే తొలిసారి ఈ బ్యూటీ ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ సమాచారం. తమిళ దర్శక–నటుడు రాజేష్ ఎమ్. సెల్వ ఇటీవల కథానాయిక ప్రాధాన్యంగా సాగే ఓ కథ తయారు చేశారని, ఈ కథ విని, ఇందులోని పాత్ర నచ్చడంతో అదితీరావ్ హైదరి పచ్చ జెండా ఊపారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ఆరంభం కానుందట. లేడీ ఓరియంటెడ్ చిత్రాల పరంగా అదితీకి ఇది తొలి అడుగు. మరి.. ఈ తొలి అడుగుతో ఈ తరహా చిత్రాలు ఇంకెన్ని చేస్తారో చూడాలి. ఇక ‘సమ్మెహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం’ వంటి చిత్రాలతో అదితీరావ్ హైదరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. -
కమల్‌తో డిష్యూం..డిష్యూం!
ఓ రెస్టారెంట్‌లోని వంట గదిలో కమల్‌హాసన్, త్రిష విపరీతంగా ఫైట్ చేసుకుంటున్నారు. అక్కడి సామానంతా చెల్లాచెదురు చేస్తున్నారు. ఒకరి మొహం మీద ఒకరు పంచ్‌లు విసురుకుంటున్నారు. రక్తాలు కారుతున్నా, వారిద్దరూ ఆగట్లేదు. అంతలో దర్శకుడు కట్... కట్... అన్నాడు. ఈ సన్నివేశాన్ని ‘చీకటి రాజ్యం’ చిత్రం కోసం ఇటీవలే చిత్రీకరించారు. ఈ సీన్ ఇప్పటికీ తనను హాంట్ చేస్తోందని త్రిష చెబుతున్నారు. కమల్‌తో అలా ఫైట్ చేయడం ఆమెకు గమ్మత్తుగా అనిపించిందట. అది కూడా ఫ్రెంచ్ ఫైట్‌మాస్టర్స్ ఆధ్వర్యంలో రియలిస్టిక్‌గా చిత్రీకరించారట. రాజేశ్ ఎమ్. సెల్వా దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రకాశ్‌రాజ్ ఇందులో ముఖ్యపాత్రధారి.