ప్రజల ఆహారంలో ధాన్యాల తర్వాత అంత ప్రాధాన్యం కలిగినవి దుంపలు. దుంప పంటలు అనగానే మనకు చప్పున గుర్తొచ్చేవి బంగాళ దుంప, కంద, చేమదుంప, క్యారెట్, ముల్లంగి, బీట్‌రూట్. ఇంకా చెప్పాలంటే కర్రపెండలం, తాటి తేగలు కూడా. అయితే, మనకు తెలియని దుంప పంట రకాలు మరెన్నో ఉన్నాయి. ఈ పంటల జీవవైవిధ్యం చాలా సుసంపన్నమైనది. గ్రామీణులు, ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలకు ఆహార భద్రతను కల్పిస్తున్నప్పటికీ దుంప పంటలు జీవవైవిధ్యం క్రమంగా అంతరించిపోతోంది. భూసార క్షీణత, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూతాపోన్నతిని దీటుగా ఎదుర్కోవడంలో దుంప పంటలు ఎంతగానో ఉపకరిస్తాయి.
ఈ దృష్ట్యా దుంప పంటలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయాన్ని ఎలుగెత్తి చాటడం కోసం సహజ సమృద్ధ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. ఇటీవల మైసూరులో ఇటీవల జరిగిన ప్రత్యేక దుంప పంటల ప్రదర్శన దక్షిణాదిలో దుంప జాతుల జీవవైవిధ్యానికి అద్దం పట్టింది. వివిధ దుంప జాతులను తోటల్లో అంతర పంటలుగా పండించుకొని పరిరక్షించుకోవచ్చు. దుంప జాతుల జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవడం, వీటితో రకరకాల వంటకాలు తయారు చేసుకునే పద్ధతులను ప్రచారంలోకి తేవడం కోసం సహజ సమృద్ధ సంస్థ నాబార్డు తోడ్పాటుతో ఇటీవల కేలండర్‌ను ప్రచురించడం విశేషం. గతంలో దేశీ వరి వంగడాలు, చిరుధాన్యాలపై కూడా కేలండర్లను ఈ సంస్థ ప్రచురించింది. దుంప పంటలు, వంటల కేలండర్ ధర రూ. 75. వివరాలకు.. బెంగళూరులోని సహజ మీడియా వారిని 70900 09922 నంబరులో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment