‘‘మా సినిమా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. మంచి సందేశంతో రూపొందించిన ఈ సినిమా పెద్దలను ఆలోచింపజేసే విధంగా ఉంటుంది’’ అని దర్శకుడు అల్లాణి శ్రీధర్ అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘డూ డూ ఢీ ఢీ’(మా ఊరి కొండ) సినిమా చిల్డ్రన్స్ వరల్డ్ విభాగంలో ఎంపికైంది. అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘బాల్యాన్ని కబళిస్తున్న డిజిటల్ ఎడిక్షన్ అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమా చేశాం.
మొబైల్స్, ఆన్‌లైన్ గేమ్స్, వీడియో గేమ్స్ వంటివి ఈ తరం బాలల్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. డిజిటల్ ఎడిక్షన్‌కు విరుగుడు ఏంటి? వీటి ప్రభావంతో ముగ్గురు పిల్లలు ఎలా మారిపోయారు. మన సంస్కృతి, ఆట పాటలు వారిని ఎలా ఆకట్టుకున్నాయి? డిజిటల్ వ్యసనపరులు చివరికి అందరి చేతా ఎలా శభాష్ అనిపించుకున్నారు? అనేది కథ’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: కిరణ్ కుమార్, సంగీతం: శశిప్రీతమ్, సమర్పణ: చింతా లక్మీనాగేశ్వరరావు.
Comments
Please login to add a commentAdd a comment