'లవ్ యూ మామా'
లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న'సర్థార్ గబ్బర్సింగ్' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్గా బ్రూస్ లీ రిలీజ్ సందర్భంగా పవన్ను కలవడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ స్పాట్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో సెట్లో పవన్, చరణ్లు దిగిన ఫోటోలు నెట్లో హల్ చల్ చేశాయి. ఆ ఫోటోల్లో గబ్బర్సింగ్ యూనిట్తోపాటు సాయిధరమ్ తేజ్ కూడా ఉండటం, అది కూడా పవన్ లాగే పోలీస్ డ్రెస్లో కనిపించటంతో సర్థార్ గబ్బర్సింగ్ సినిమాలో సాయి కూడా నటిస్తున్నాడనే టాక్ అభిమానుల్లో మొదలైంది.
ఆ వార్తలన్నిటికీ చెక్ పెడుతూ ఓ క్లారిటీ ఇచ్చేశాడు సాయిధరమ్ తేజ్. 'సర్థార్ గబ్బర్సింగ్' షూటింగ్ పక్కనే తన తదుపరి చిత్రం 'సుప్రీమ్' షూటింగ్ జరుగుతుందని సాయి ట్విట్టర్లో పేర్కొన్నారు. కల నిజమైందని, సర్థార్ సెట్ పక్కనే తన సినిమా షూట్ జరుగుతోందని.. అనూహ్యంగా 'సుప్రీమ్' సినిమా కోసం తన ఔట్ఫిట్ కూడా ఇలా మారిందని.. సాయి ట్వీట్ చేశారు. పవన్ని ఉద్దేశిస్తూ.. లవ్ యూ మామా అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
#dreamscometrue was shooting beside #SGS set & guess wht my outfit turned out 2 be for #Supreme. 😁🙏🏼 love u mama! pic.twitter.com/Qp4KUc5k3P
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 18, 2015