అమీర్ ఖాన్
ప్ర: కోలీవుడ్‌లో మీకు నచ్చిన హీరో?
జ: నేను సూపర్‌స్టార్ రజనీకాంత్ వీరాభిమానిని. ఆయన హిందీలో నటించిన ఉత్తర దక్షిణ్, జానీ, గిరీఫ్ చిత్రాలు చూసి ఆయన అభిమానిగా మారిపోయూను. నేను అదృష్టంగా భావించే మరో విషయమేమిటంటే... నేను హీరోగా పరిచయమైన తొలి రోజుల్లోనే రజనీకాంత్‌తో ఆతక్ హి ఆతక్ చిత్రంలో నటించే అవకాశం రావడం. అప్పట్లోనే రజనీ చాలా పెద్ద స్టార్ హీరో కావడంతో ఆయనతో నటించడానికి భయపడ్డాను. అప్పుడు రజనీ ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన నిరాడంబరత, మానవతా దృక్పథం అన్నింటికీ మించి వృత్తిలో ఆయన నిబద్ధత ఆయనపై నాకున్న గౌరవాన్ని మరింత పెంచాయి. రజనీకాంత్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనతో కలసి నటించడం గొప్ప అనుభవం.
ప్ర: తమిళ సినిమాల రీమేక్‌లో నటిస్తారా?
జ: ఇంతకుముందు సూర్య నటించిన గజని చిత్రం చూసి ఆశ్చర్యపోయూను. సూర్య పోషిం చిన పాత్రను నేను అంత బాగా నటించగలనా అన్న సందేహం కలిగింది. ఎందుకంటే అంతవరకు నేను విలన్‌లతో వీరోచితంగా పోరాడిన సందర్భాలు లేవు. అందువలనే వెంటనే సూర్య కు ఫోన్ చేసి నా అనుమానాన్ని చెప్పాను. అప్పుడాయన మీరు ఖచ్చితంగా చేయగలరని ధైర్యం ఇచ్చారు. దీంతో నేనా చిత్రంలో నటించాను. ప్రస్తుతానికి తమిళ రీమేక్‌లో నటించే ఆలోచన లేదు.
ప్ర: కమల్ నటించిన ఉన్నాల్ ముడియుమ్ తంబి హిందీ రీమేక్‌లో మీరు నటించనున్నట్లు ప్రచారం జరిగిందే?
జ: తారే జమీన్ పర్ చిత్రానికిగాను గొల్లపూడి అవార్డునందుకోవడానికి చెన్నై వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ను కలుసుకునే అవకాశం కలిగింది. అప్పుడాయన నటన గురించి మెచ్చుకుంటుంటే ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇటీవల చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల కోసం చెన్నై వచ్చినప్పుడు కె.బాలచందర్‌ను ప్రత్యేకంగా కలిశాను. ఆయనంటే చాలా గౌరవం. అయితే ఉన్నాల్ ముడియుమ్ తంబి రీమేక్‌లో నటించనున్నారన్నది వదంతి మాత్రమే.
ప్ర: తమిళ చిత్రంలో నటిస్తారా?
జ: తమిళ చిత్ర పరిశ్రమలో సినీ కళాకారులెందరో ఉన్నారు. ఏ ఆర్ మురుగదాస్, ఏ ఆర్ రెహ్మాన్, చాయాగ్రాహకుడు రవి కె చం ద్రన్ వంటివారు బాలీవుడ్‌లో గొప్ప పేరు తెచ్చుకున్నారు. నాకు తమిళంలో నటించాలన్న కోరిక ఉన్నా భాష తెలియదు. భాష తెలియని పాత్ర లాంటి అవకాశం వస్తే నటిస్తాను.
ప్ర: ధూమ్-3 చిత్రం గురించి?
జ: దర్శకుడు కథ చెబుతున్నప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ తరహా చిత్రం ఎప్పుడూ చేయలేదు. ఛాలెంజింగ్‌తో కూడిన పాత్రను ధూమ్-3లో చేశాను.
ప్ర: మీ పాత్ర గురించి...
జ: నేనిందులో సర్కస్ మాస్టర్. ఈ చిత్రంలో మనుషుల ఫీట్స్, ఆసక్తికరంగా ఉంటాయి. సర్క స్ నేపథ్యంలో పాట కూడా ఉంది. ఈ పాత్ర కోసం చాలా శ్రమించాను. చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు సోషల్ మెసేజ్ కూడా ఉంది.
ప్ర: ఏ తరహా పాత్రలు పోషించాలని ఆశిస్తున్నారు?
జ: నాకు నచ్చిన, ప్రేక్షకులు మెచ్చిన చిత్రాలు చేయాలనుకుంటున్నాను. ఏ తరహా పాత్ర చేసి నా ప్రేక్షకులకు కావలసిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలన్నదే అల్టిమేట్.