ఆర్య అంటే అందరికీ ఇష్టమే | Everybody Loves Arya, says Anushka Shetty | Sakshi
Sakshi News home page

ఆర్య అంటే అందరికీ ఇష్టమే

Published Wed, Dec 4 2013 1:56 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

ఆర్య అంటే అందరికీ ఇష్టమే - Sakshi

ఆర్య అంటే అందరికీ ఇష్టమే

నటుడు ఆర్యను అందరూ ఇష్టపడతారని చెప్పింది నటి అనుష్క. అందుకే ఆయన్ని హీరోయిన్ల హీరో అంటారనుకుంటా. ఇక ఆర్య, అనుష్క ఇరండాం ఉలగంలో జత కట్టిన విషయం తెలిసిందే. రెండేళ్లకు పైగా నిర్మాణ కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను మాత్రం చాలా నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. అయితే ఈ చిత్రంలో ఆర్యతో కలసి నటించడం తీయని అనుభవం మిగిల్చిందంటున్నారు క్రేజీ హీరోయిన్ అనుష్క. ఈ బ్యూటీతో చిన్న ఇంటర్వ్యూ.
 
ఆర్యతో మీ స్నేహం?
నిజం చెప్పాలంటే ఆర్య గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్య చాలా మంచి స్నేహశీలి. స్నేహానికి ఆయన చాలా ప్రాధాన్యతనిస్తారు. ఆర్యతో నటిస్తున్న తొలి రోజుల్లో ఆయన కఠోర శ్రమ చూసి ఆశ్చర్యపోయాను. ఆర్యను అందరమ్మాయిలు ఇష్టపడుతారు. అంత మంచి క్యారెక్టర్ ఆయనది. తనతో నటించే నటీమణులకు ఎంతగానో సహకరిస్తారు.
 
 ఆర్యకు యోగా నేర్పించారట? 
 నేను చాలాకాలంగా యోగా నేర్చుకుంటున్నాను. నన్ను అడిగిన చాలామందికి యోగా నేర్పించాను. అయితే ఆర్యకు నేర్పించాననడం అబద్ధం. నిజానికి ఆర్య నా కంటే చాలా ఫిట్. వ్యాయామంతో తన శరీరాన్ని ఖచ్చితంగా ఉంచుకున్నారు. అలాంటి నటుడికి నేను యోగా నేర్పించాననడం అసత్య ప్రచారం.
 
 తమిళ అభిమానులపై ఏమనుకుంటున్నారు?
 నా ముఖం వారికి ఏదో ఒక కోణంలో నచ్చింది. నా నుంచి అభిమానులు మంచి చిత్రాలను ఆశిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే మంచి సినిమా అయితే అనుష్కనే కాదు ఎవరు నటించినా ఆదరిస్తారు.
 
 తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేస్తున్నారే?
 అలాంటిదేం లేదు. రెండు భాషల్లోనూ కథ లు వింటున్నాను. ఏది నచ్చితే అది చేస్తున్నాను. తమిళం, తెలుగు రెండు భాషా చిత్రాలకు ప్రాధాన్యత నిస్తాను.
 
  మీరు చాలా పొడవుగా ఉన్నారు కదా?
 అందరూ అనుకుంటున్నట్లు నేనేమంత ఎత్తు కాదు. అయితే ఎవరో ఏదో అనుకుంటున్నారని నేను స్పందించాల్సిన అవసరం లేదు. కాస్త పొడవున్నా మాట్లాడుతారు, కాస్త పొట్టిగా వున్నా కామెంట్ చేస్తారు. అలాంటి ప్రచారం గురించి పట్టించుకోనక్కరలేదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement