డేనియల్ ర్యాడ్‌క్లిఫ్
హ్యారీపోటర్ నటుడు డేనియల్ ర్యాడ్‌క్లిఫ్‌కు కరోనా సోకిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేలింది. సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తల్ని ర్యాడిక్లిఫ్ ప్రతినిధి కొట్టిపరేశారు. ఆయనకు ఎటువంటి వైరస్ సోకలేదని ఆయన తేల్చిచెప్పారు. మంగళవారం ఉదయం ట్విటర్‌లో ‘‘ బ్రేకింగ్ : డేనియల్ ర్యాడ్‌క్లిఫ్‌కు కరోనా సోకింది. కరోనా సోకిన ప్రముఖ వ్యక్తుల్లో ర్యాడ్‌క్లిఫ్ మొదటి వారు’’ అంటూ ఓ వార్త వెలువడింది. బీబీసీ న్యూస్ పేరిట ఈ వార్త రావటంతో త్వరగానే వైరలైంది. ట్వీట్ చేయబడిన కొన్ని గంట్లోనే 3లక్షల లైకులు సంపాదించింది. ( నాకు నటించడం రాదు: నటుడు)
వైరలైన ఫేక్ ట్వీట్
ఈ ఫేక్ ట్వీట్ చేసిన వారిని ప్రశ్నించగా.. ‘‘ వార్తను వైరల్ చేయటానికి ఓ ప్రముఖ వ్యక్తి అవసరమయ్యాడు. ఆ వ్యక్తి గురించి ప్రజలు బాగా ఆలోచించాలని అనుకున్నాము. అప్పుడే మాకు హ్యారీపోటర్ స్టార్ డేనియల్ ర్యాడ్‌క్లిఫ్ గుర్తుకు వచ్చాడు. ఎందుకంటే అతడు చిన్నప్పటినుంచి సినిమాలు చేస్తున్నాడు. దీనికితోడు అతడు సోషల్ మీడియా పాపులర్ కాద’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment