Daniel Radcliffe
-
హ్యారీపొటర్ నాటి పరిస్థితులు రాకూడదు: డేనియల్
హ్యారీపొటర్ ఫేమ్ డేనియల్ రాడ్‌క్లిఫ్ ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తను విపరితంగా మద్యం సేవించేవాడినని వెల్లడించాడు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేనియల్ మాట్లడుతూ.. హ్యారీపొటర్ సినిమా సమయంలో మద్యం తనని ఎంతగా ప్రభావితం చేసిందో ఈ సందర్భంగా వివరించాడు. ‘యువనటుడిగా ఎప్పటికీ గుర్తుండిపోవాలని చాలా కష్టపడ్డాను. అయితే హ్యారీపొటర్లోలో తెలివైన అబ్బాయిగా కనిపించిన నేను... వాస్తవ జీవితంతో దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాను. తరచూ మద్యం సేవిస్తూ ఎప్పుడూ మత్తులోనే ఉండేవాడిని. ఆ సమయంలో తనపై వీపరితంగా విమర్శలు వచ్చేవని ఇక వాటిని పట్టించుకోకుండా ఉండేందుకు మరింతగా మద్యం సేవించేవాడిని’ అని అప్పటీ చేదు అనుభవాలను పంచుకున్నాడు. (నాకు నటించడం రాదు: నటుడు) 2010 నుంచి మంచి నటుడిగా ఉన్న డేనియల్ తన స్నేహితుల సహాయంతో తాగడం మానేసినట్లు పేర్కొన్నాడు. ‘‘ఓ రోజు ఉదయం లేవగానే.. నన్ను నేను ప్రశ్రించుకున్నాను. ఇంతగా మద్యానికి బానిసకావడం మంచిది కాదని.. మానేయాలని నిర్ణయించుకున్నానని. మద్యం మానేయాలనేది నా స్వంతంగా తీసుకున్ననిర్ణయం’’ అని చెప్పాడు. అయితే ‘‘నేను మద్యం మత్తులో ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా షూటింగ్‌కి వేళ్లడం మానలేదు. ఎందుకంటే నేను నా వృత్తిని ఇష్టపడతాను. సెట్లో ఉన్నంత సేపు నా వ్యక్తిగత ఆలోచనలు ప్రభావితం చేసే రోజు ఒక్కరోజు కూడా రాలేదు. ఇందుకు చాలా సంతోషం. ఇక హ్యారీపొటర్ నాటి పరిస్థితులు నా జీవితంలో ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్న’’ అని పేర్కొన్నాడు. -
నటుడికి కరోనా వైరస్.. ఫేక్ ట్వీట్ వైరల్
హ్యారీపోటర్ నటుడు డేనియల్ ర్యాడ్‌క్లిఫ్‌కు కరోనా సోకిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేలింది. సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తల్ని ర్యాడిక్లిఫ్ ప్రతినిధి కొట్టిపరేశారు. ఆయనకు ఎటువంటి వైరస్ సోకలేదని ఆయన తేల్చిచెప్పారు. మంగళవారం ఉదయం ట్విటర్లో ‘‘ బ్రేకింగ్ : డేనియల్ ర్యాడ్‌క్లిఫ్‌కు కరోనా సోకింది. కరోనా సోకిన ప్రముఖ వ్యక్తుల్లో ర్యాడ్‌క్లిఫ్ మొదటి వారు’’ అంటూ ఓ వార్త వెలువడింది. బీబీసీ న్యూస్ పేరిట ఈ వార్త రావటంతో త్వరగానే వైరలైంది. ట్వీట్ చేయబడిన కొన్ని గంట్లోనే 3లక్షల లైకులు సంపాదించింది. ( నాకు నటించడం రాదు: నటుడు) వైరలైన ఫేక్ ట్వీట్ ఈ ఫేక్ ట్వీట్ చేసిన వారిని ప్రశ్నించగా.. ‘‘ వార్తను వైరల్ చేయటానికి ఓ ప్రముఖ వ్యక్తి అవసరమయ్యాడు. ఆ వ్యక్తి గురించి ప్రజలు బాగా ఆలోచించాలని అనుకున్నాము. అప్పుడే మాకు హ్యారీపోటర్ స్టార్ డేనియల్ ర్యాడ్‌క్లిఫ్ గుర్తుకు వచ్చాడు. ఎందుకంటే అతడు చిన్నప్పటినుంచి సినిమాలు చేస్తున్నాడు. దీనికితోడు అతడు సోషల్ మీడియా పాపులర్ కాద’ని తెలిపారు. -
రోడ్డుపై దోపిడీ: ఆ యువహీరో అనూహ్యంగా!
లండన్: హ్యారీపొటర్ హీరో డానియెల్ ర్యాడ్‌క్లిప్ నిజజీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నాడు. మోటారు వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ పర్యాటకుడిపై దాడి చేయగా.. అక్కడే ఉన్న ర్యాడ్‌క్లిప్ క్షణం ఆలస్యం చేయకుండా బాధితుడికి సహాయం చేశాడు. ముఖానికి గాయమైన అతడిని ఆదుకున్నాడు. ఈ ఘటన లండన్‌లోని ఫ్యాషనబుల్ కింగ్స్ రోడ్డులో జరిగింది. మోటారు వాహనంపై దూసుకొచ్చిన ఇద్దరు దుండగులు పర్యాటకుడి వద్దనుంచి బలవంతంగా బ్యాగు లాక్కెళ్లారు. దీంతో కిందపడిపోయిన పర్యాటకుడి ముఖానికి గాయాలయ్యాయి. దుండగుల చర్యను గమించిన ఓ మాజీ పోలీసు వెంటనే తన వాహనాన్ని వారి మోపెడ్‌కు అడ్డంగా పెట్టారు. దీంతో బెదిరిపోయిన దుండగులు పారిపోయారు. అనంతరం సంఘటనాస్థలికి వచ్చి ఆ మాజీ పోలీసు అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయాడు. ఎందుకంటే కిందపడిన బాధితుడికి సాయం చేస్తూ యువహీరో ర్యాడ్‌క్లిప్ కనిపించాడు. ’నేను చూసింది నిజమేనా అని నమ్మలేకపోయాను. మీరు ’డానియెల్ ర్యాడ్‌క్లిప్’ కదా అని అడిగాను. ఔను అంటూ ఆయన బదులిచ్చారు. అతను చాలామంచి వ్యక్తి. చాలామంది సినీ ప్రముఖులు అలాంటి పరిస్థితులను చూసి ఆగనైనా ఆగరు’ అని ఉగ్రవాద నిరోధక దళంలో పనిచేసిన ఆ అధికారి వివరించారు. ఈ ఘటన నిజమేనని ర్యాడ్‌క్లిప్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.