భార్య విసిగిస్తోంది.. విడాకులు ఇప్పించండి | Fan Request To Sonu Sood Diverging From Wife | Sakshi
Sakshi News home page

భార్య విసిగిస్తోంది.. విడాకులు ఇప్పించండి

Published Sun, Jun 7 2020 4:17 PM | Last Updated on Sun, Jun 7 2020 4:22 PM

Fan Request To Sonu Sood Diverging From Wife - Sakshi

సాక్షి, ముంబై : వలస కార్మికులను ఆదుకుంటూ నిజమైన హీరోగా అభినందనలు అందుకుంటున్న బాలీవుడ్‌ నటుడు సోనూసుద్‌కు సోషల్‌ మీడియాలో వింత ఫిర్యాదులు అందుతున్నాయి. కొంతమంది వలస జీవులు తమనూ ఆదుకోవాలంటూ వేడుకుంటుండగా.. మరికొందరు మాత్రం సంసార జీవిత సమస్యలను పరిష్కరించాలని భిన్నమైన కోరికలు కోరుతున్నారు. తాజాగా తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలంటూ అసోంకు చెందిన ఓ వ్యక్తి ట్విటర్‌ వేదికగా సోనూసుద్‌ను అభ్యర్థించాడు. (సోనూ‌కు రాజకీయ రంగు: మోదీతో భేటీ) 

‘కరోనా కారణంగా ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. లాక్‌డౌక్‌తో అసోంలో చిక్కుకుని పోయాను. మా సొంత పట్టణం హర్యానా. ఉద్యోగం లేకపోవడంతో నా భార్య రోజూ విసిగిస్తోంది. ఆమె గొడవతో రోజూ ఏగలేపోతున్నా. భార్య నుంచి  విడాకులు ఇప్పించండి. అలాగే గువహటిలో చిక్కుకున్న నన్ను ఢిల్లీ పంపించండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా తన గోడును వెల్లబోసుకున్నాడు. (‘నా భర్తతో కలిసి ఉండలేను.. సాయం చేయండి’)

బాధితుడు ట్విట్‌కు స్పందించిన సోనూసుద్‌.. ‘చిన్నచిన్న విషయాలకు భాగస్వామి నుంచి విడిపోవాలని అనుకోవడం సరైనది కాదు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకొండి. మీ భార్యతో కలిసి ఉంటానని మాటిస్తే మీకు తప్పకుండా సహాయం చేస్తాను’ అని బదులిచ్చాడు. కాగా లాక్‌డౌన్‌ కాలంలో తన భర్తతో కలిసి ఉండలేకపోతున్నానని, ఇద్దరిని వేరు చేయాలని సుష్రిమా ఆచార్య అనే ఓ మహిళ ఇటీవల ట్విటర్‌ ద్వారా అభ్యర్థించిన విషయం తెలిసిందే. (గర్ల్‌ ఫ్రెండ్‌ను కలవాలంటూ నటుడికి ట్వీట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement