గుమ్మడికాయ కొట్టేసిన 'ఆక్సిజన్' టీం | Gopichands Oxygen Shooting Completed | Sakshi
Sakshi News home page

గుమ్మడికాయ కొట్టేసిన 'ఆక్సిజన్' టీం

Published Fri, Feb 3 2017 3:31 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

గుమ్మడికాయ కొట్టేసిన 'ఆక్సిజన్' టీం

గుమ్మడికాయ కొట్టేసిన 'ఆక్సిజన్' టీం

గోపిచంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఆక్సిజన్ షూటింగ్ పూర్తి చేసుకుంది. నీ మనసు నాకు తెలుసు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఏఎం.జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

గోపిచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ మూవీని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఏఎం.రత్నం కోడలు ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్లలో గోపిచంద్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ట్రైలర్ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు.

ముంబై, గోవా, సిక్కిం, చెన్నైలలో తెరకెక్కిన ఈ సినిమాకు  యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.  జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు కీలక పాత్రల్లో నటిస్తున్న ఆక్సిజన్ ఆడియోను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో రిలీజ్ తరువాతే సినిమా రిలీజ్ పై క్లారిటీ రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement