
కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మ్యూజికల్ డ్రామా ‘సర్వం తాళమయం’. మిన్సార కనవు, కండుకొండేన్ కండుకొండేన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ సుమారు 18 ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం సర్వం తాళమయం.
ఈ సినిమాలో జీవీకి జంటగా అపర్ణా బాలమురళి నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు.జియో స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు.