హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ బహుమతి ఇచ్చాడు. బహుమతి అంటే ఏంటో అనుకునేరు. అభిమానులకు మరింత దగ్గర అయ్యేందుకు బన్నీ ట్విట్టర్లో అందుబాటులోకి వచ్చాడు. తన పుట్టిన రోజైన ఏప్రిల్ 8వ తేదీన ఉదయం సరిగ్గా 8 గంటలకు తన ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్ అయ్యాడు.
అంతకుముందు కూడా యువర్స్ ట్రూలీ బన్నీ అనే పేరుతో ఒక ట్విట్టర్ ఖాతా ఉన్నా.. అది అర్జున్ అసలైన అకౌంట్ కాదు. సనాఫ్ సత్యమూర్తి సినిమా విడుదల అవుతున్న సందర్భానికి దగ్గర్లోనే అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతాలో అభిమానులకు అందుబాటులో ఉండటం శుభవార్తే.
Chal chalo chaloo...Life sey miloo...Idho kotha chapter...Just say HELLLOOOO !
— Allu Arjun (@alluarjun) April 8, 2015