బన్నీ సినిమా అతడితోనే..!
బన్నీ సినిమా అతడితోనే..!
Published Sat, Apr 9 2016 8:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM
వరుస సూపర్ హిట్స్తో మంచి ఫాంలో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ సరైనోడుతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయిన ఈ సినిమా ఈ నెల 22న గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు బన్నీ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. తమిళ దర్శకులతో బన్నీ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించినా అఫీషియల్గా మాత్రం కన్ఫామ్ కాలేదు.
సరైనోడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తమిళ దర్శకుడు లింగుసామి డైరెక్షన్లో బన్నీ సినిమా ఉంటుందన్న ప్రచారం జరిగింది. అంతేకాదు బన్నీ సినిమా కోసం లింగుసామి, విశాల్ సినిమాను కూడా పక్కన పెట్టేశాడన్న వార్త అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఆ తరువాత మనం, 24 సినిమాల దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా అల్లు అర్జున్తో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడన్న వార్త వినిపించింది. అయితే ఈ ప్రాజెక్ట్స్ ఏవీ సెట్స్ మీదకు రాలేదు.
తాజాగా బన్నీ పుట్టిన రోజు సందర్భంగా హారికా హాసిని క్రియేషన్స్ విడుదల చేసిన ఓ పోస్టర్, అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చేసింది. బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు, ఈ పోస్టర్లో తమ బ్యానర్లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమాను నిర్మిస్తున్నట్టుగా హింట్ ఇచ్చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సక్సెస్లు అందించిన ఈ కాంబినేషన్లో త్వరలో హ్యాట్రిక్ మూవీ వస్తుందన్న ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్.
Advertisement
Advertisement