సనాఫ్ సత్యమూర్తి ఎంతసేపు ఉంటాడు? | son of satyamurthy to be 162 minutes long | Sakshi
Sakshi News home page

సనాఫ్ సత్యమూర్తి ఎంతసేపు ఉంటాడు?

Published Wed, Apr 1 2015 5:01 PM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

సనాఫ్ సత్యమూర్తి ఎంతసేపు ఉంటాడు?

సనాఫ్ సత్యమూర్తి ఎంతసేపు ఉంటాడు?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, సమంత జంటగా వస్తున్న సనాఫ్ సత్యమూర్తి సినిమా మీద అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. రేసుగుర్రం విజయంతో మంచి ఊపుమీదున్న బన్నీ.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనని అందరూ చూస్తున్నారు. మరి ఎడిటింగ్ అనంతరం సినిమా ఎంతసేపు ఉంటుందో తెలుసా.. సరిగ్గా 162 నిమిషాలట. సెన్సార్ కూడా ముగించుకున్న ఈ సినిమా ఏప్రిల్ 9వ తేదీన విడుదల కానుంది. సరిగ్గా ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమయ్యే తర్వాతిరోజే సినిమా వస్తుండటం గమనార్హం.

బన్నీతో పాటు ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్, అదా శర్మ, స్నేహ, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర తదితరులు నటిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ విభిన్నంగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కఠిన శిక్షణ పొందాడట. పిల్లిమొగ్గల దగ్గరనుంచి జిమ్నాస్టిక్స్ వరకు చాలా నేర్చుకున్నాడని చెబుతున్నారు. ఈ పాత్ర కోసం బన్నీ 10 కిలోల బరువు కూడా తగ్గాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement