గత ఏడాది సమ్మర్‌కి ‘రేసుగుర్రం’తో ఆకట్టుకున్న అల్లు అర్జున్, ఈ వేసవికి ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా అలరించనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తనదైన శైలిలో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇండియాలోనే తొలిసారిగా ఈ సినిమా డిజిటల్ పోస్టర్‌ను త్రీడీలో విడుదల చేయడం విశేషం. ఈ సినిమాలో అల్లు అర్జున్ తనయుడు నటించాడనే వార్త ప్రచారంలో ఉంది.
అయితే, చిత్ర యూనిట్ వర్గాలు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఆ వార్త నిజం కాదని తెలిపాయి. ఒక్క పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఆ పాటను నేటి నుంచి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో సెట్స్ వేసి చిత్రీకరిస్తున్నారు. చిత్ర ప్రధాన తారాగణంపై చాలా స్పెషల్‌గా ఈ పాటను ప్లాన్ చేశారట. ఒక ప్రముఖ కథానాయిక ఈ పాటలో తళుక్కున మెరవనున్నట్టు సమాచారం. త్రిష, తాప్సీ, కొంతమంది హిందీ కథానాయికల్ని ఇందుకోసం ప్రయత్నించారని భోగట్టా. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 15న విడుదల చేస్తున్నారు.
ఆ స్పెషల్ ఏంటి?
Published Tue, Mar 10 2015 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement
Advertisement