'సన్నాఫ్ సత్యమూర్తి'కి యాపిల్ కాంప్లిమెంట్ | best of 2015 apple selects son of satyamurthy | Sakshi
Sakshi News home page

'సన్నాఫ్ సత్యమూర్తి'కి యాపిల్ కాంప్లిమెంట్

Published Fri, Dec 11 2015 8:50 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

'సన్నాఫ్ సత్యమూర్తి'కి యాపిల్ కాంప్లిమెంట్ - Sakshi

'సన్నాఫ్ సత్యమూర్తి'కి యాపిల్ కాంప్లిమెంట్

ఈ ఏడాది బిగెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచిన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాకు మరో గౌరవం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ రంగంలో సంచలనాలు నమోదు చేస్తున్న యాపిల్ సంస్థ, ఈ ఏడాది అత్యుత్తమ తెలుగు ఆల్బమ్గా 'సన్నాఫ్ సత్యమూర్తి'ని ఎంపిక చేసింది. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు.

ప్రతి ఏడాది యాపిల్ సంస్థ ఐట్యూన్స్ స్టోర్ ద్వారా రిలీజ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్స్లో బెస్ట్ ఆల్బమ్స్ను, ఆ ఏడాది చివరలోఎంపిక చేస్తోంది. కేవలం సేల్స్ పరంగానే కాకుండా, మ్యూజిక్ క్వాలిటీ, జనరంజకమైనవి లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ సెలక్షన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది గాను తెలుగులో దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అదించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాను సెలెక్ట్ చేసింది. యాపిల్ అందిస్తున్న ఈ గౌరవంతో దేవీ సంగీతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement