శ్రీలంకలో మొనగాడు!
హీరో అర్జున్, దర్శకుడు కోడి రామకృష్ణలది సూపర్ హిట్ కాంబినేషన్. అర్జున్‌కు కుటుంబ కథా చిత్రాల కథానాయకునిగా గుర్తింపు తీసుకొచ్చింది కోడిరామకృష్ణే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘మా పల్లెలో గోపాలుడు’, ‘మన్నెంలో మొనగాడు’, ‘మావూరి మారాజు’, ‘పుట్టింటికి రా చెల్లి’ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు అర్జున్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో శైలజ ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఆర్.రామచంద్రరాజు నిర్మిస్తున్న చిత్రం ‘రాణీ రాణమ్మ’. లక్ష్మీ రాయ్ కథానాయిక. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ‘‘కుటుంబ బాంధవ్యాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
హీరో ఓ పాపను ఆమె స్వస్థలమైన శ్రీలంకకు ఎలా చేర్చాడు? అసలు వారిద్దరూ శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే ది ఈ చిత్ర ఇతివృత్తం. పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా ‘కాల్చ’ అనే చిత్రానికి ఇది రీమేక్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మూలకథ: బ్లెస్సీ, ఛాయాగ్రహణం: కోడి లక్ష్మణ్, సంగీతం ఎస్.ఎ రాజ్‌కుమార్.