పూరి బాటలో రానా | Hero rana to start talent management company | Sakshi
Sakshi News home page

పూరి బాటలో రానా

Published Tue, Aug 23 2016 2:40 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

పూరి బాటలో రానా - Sakshi

పూరి బాటలో రానా

నటుడిగా సౌత్తో పాటు నార్త్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా, ఇప్పుడు వ్యాపార రంగం మీద దృష్టిపెట్టాడు. గతంలో ఓ యానిమేషన్ కంపెనీ నడిపిన అనుభవం ఉన్న ఈ మ్యాన్లీ హంక్, ఇప్పుడు టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ చేస్తున్నాడట. అయితే కొత్తగా కంపెనీని ఏర్పాటు చేసే కన్నా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ అయితే బెటర్ అని భావించి, ముంబైలో నడుస్తున్న కంపెనీని టేకోవర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా పూరి కనెక్ట్స్ పేరుతో ఇదే తరహా వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ కంపెనీ ద్వారా సెలెక్ట్ అయిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం నుంచి పది శాతం వరకు కంపెనీకి వచ్చేలా ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార పరంగానే కాకుండా కొత్త వారికి అవకాశాలు కూడా కల్పిస్తుండటంతో ఈ తరహా వ్యాపారాల మీద సినీ ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement