సాక్షి, హైదరాబాద్ : ‘96’ సినిమా షూటింగ్‌లో భాగంగా థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తూ హీరో శర్వానంద్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో శర్వానంద్ షోల్డర్ డిస్ లొకేట్ అయ్యింది. కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ఘటన తర్వాత శర్వానంద్ వెంటనే థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా వెళ్లి సన్ షైన్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. పరీక్షలు చేసిన డాక్టర్లు సోమవారం ఆయనకు శస్త్ర చికిత్స చేశారు.
(చదవండి : గాయాలపాలైన మరో యంగ్ హీరో)
నలుగురు డాక్టర్లతో కూడిన బృందం 11 గంటలపాటు శ్రమించి శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. భుజానికి తగిలిన గాయం పెద్దది కావడంతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని డాక్టర్లు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం శర్వానంద్‌కు రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్స్ సూచించారు. కాగా శర్వానంద్‌కు గాయం కారణంగా ‘రణరంగం’, ‘96’ సినిమాల షూటింగ్‌కు అంతరాయం ఏర్పాడింది.
(చదవండి : ఈ యువ హీరోలకు ఏమైంది!)
Comments
Please login to add a commentAdd a comment