చక్కనమ్మ చిక్కింది.. ! | heroine Rashi khanna acts in imaikkaa nodigal movie | Sakshi
Sakshi News home page

చక్కనమ్మ చిక్కింది.. !

Published Thu, Aug 24 2017 8:00 PM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM

చక్కనమ్మ చిక్కింది.. !

చక్కనమ్మ చిక్కింది.. !

హీరోయిన్లకు అభినయంతో పాటు అందం చాలా అవసరం. దాన్ని కాపాడుకోవడానికి నిరంత శారీరక శ్రమ చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా టాలీవుడ్‌లో హీరోయిన్లు చాలా స్లిమ్‌గా ఉంటేనే అభిమానులు ఆదరిస్తారు. కోలీవుడ్లో అలా కాదు బబ్లీగా ఉన్నా చూసేస్తారు. కాగా హీరోయిన్‌ రాశీఖన్నా ఇతర హీరోయిన్ల కన్నా కాస్త బొద్దుగా ఉంటుంది. అయినా హీరోయిన్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉంది.

తెలుగులో ఐదు, తమిళంలో ఒకటి, మలయాళంలో ఒకటి అంటూ నటించేస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఇంకా కోలీవుడ్ తెరపై ప్రత్యక్షం కాలేదు. తెలుగులో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ సరసన జై లవకుశ చిత్రం నటిస్తోంది. అంతేకాక రవితేజకు జంటగా టచ్‌ చేసి చూడు, వరుణ్‌తేజతో మరో చిత్రం చేస్తున్న రాశీఖన్నా, సిద్ధార్థ్‌తో సైతాన్‌ కా బచ్చా చిత్రంలో కూడా నటిస్తోంది. ఇది తమిళంలోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇమైకా నోడిగళ్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేస్తున్న రాశీఖన్నా ఇందులో అధర్వతో రొమాన్స్ చేస్తోంది.

అదే విధంగా మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న విలన్‌ చిత్రం ద్వారా తెరంగేట్రం చేస్తోంది. కాస్త బొద్దుగా ఉండే ఆ అమ్మడిని బరువు తగ్గాలన్న దర్శక నిర్మాతల షరతులతో నాలుగు నెలలుగా డైట్ చేస్తూ సన్నబడి ఇప్పుడు మరింత అందంగా తయారైంది. రాశీఖన్నాలోని కొత్త అందాలను చూడవచ్చునన్నమాట. చూద్దాం ఆ జాన ఇమైకా నోడిగళ్‌ ఎంత అందాలను ఒలకబోస్తుందో. తను కూడా  ఈ చిత్రం కోసం చాలానే ఎదురుచూస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement