స్విమ్‌ సూట్‌లో నటి ఫొటోలు వైరల్‌.. | heroine Shriya saran sim Dress photos viral in internet | Sakshi
Sakshi News home page

స్విమ్‌ సూట్‌లో నటి ఫొటోలు వైరల్‌..

Published Wed, Nov 1 2017 10:33 PM | Last Updated on Wed, Nov 1 2017 10:33 PM

heroine Shriya saran sim Dress photos viral in internet - Sakshi

నీటిలో బ్యూటీస్‌ అంటేనే ఆ అందాలు కనువిందే.  హీరోయిన్‌ శ్రియ లాంటి సొగసైన భామ సిమ్‌ డ్రస్‌లో సముద్ర నీటి అడుగు భాగంలో హుషారుగా ఈదుతుంటే ఆ సొగసు చూడతరమా. శ్రియలో మంచి నటి ఉందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అందాల విషయానికి వస్తే శివాజీ లాంటి చిత్రాలలో శ్రియ అందాలను యువత తనివిదీరా చూసి ఆస్వాదించేశారు. విజయ్‌, విక్రమ్‌, ధనుష్‌ లాంటి స్టార్‌  హీరోలతో నటించిన ఈ అమ్మడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకుంది.

అయితే కోలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేవన్నది నిజం.  తాజాగా నరకాసురన్‌ చిత్రంతో ప్రతి నాయకిగా నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఇండోనేషియ వెళ్లిన శ్రియ అక్కడ సముద్ర తీరంలో టూపీస్‌ దుస్తులతో జలకాలాడింది. అక్కడ మత్స్య కన్యలా ఈదుకుంటూ చేసిన విన్యాసాలను, భంగిమలను హాలీవుడ్‌ ఫోటోగ్రాఫర్‌తో పోటోలు తీయించుకుని వాటిని ఇంటర్నెట్‌లో పోస్టు చేసింది. 

ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అవకాశాలు అంతగా లేకపోయినా తన అందాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికే శ్రియ ఇలాంటి అర్ధ నగ్న ఫోటోలను ప్రచారానికి ఉపయోగించుకుంటుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇక నెటిజన్లు మాత్రం టూపీస్‌ దుస్తుల్లోని శ్రియ ఫోటోలను తెగ వాడేసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement