బాలయ్య హీరోయిన్ ఎవరు?
బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వై. రాజీవ్‌రెడ్డి, జె. సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ధారించలేదు.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. బాలయ్య సరసన సింహా, శ్రీరామరాజ్యం వంటి హిట్ సినిమాల్లో నటించిన నయనతార పేరును పరిశీలిస్తున్నారు. నయనతార సహా కొంతమంది హీరోయిన్లతో సంప్రదించారని, ఇంకా ఎవరి పేరును ఖరారు చేయలేదని యూనిట్ వర్గాలు చెప్పాయి. కాగా నయనతార ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. నయనతార డేట్స్ను సర్దుబాటు చేయగలిగితే మరోసారి బాలయ్య సరసన నటించే అవకాశం రావచ్చు.