మిలటరీ ట్యాంకర్లు... మొబైల్ స్టోర్..!
దర్శకుడు శంకర్ ఓ పట్టాన రాజీపడరు. ఒక్క సీన్ కోసం ఎంతైనా ఖర్చుపెడతారు. ఎన్ని టేక్స్ అయినా తీస్తారు. ప్రస్తుతం ‘రోబో’కు సీక్వెల్‌గా తీస్తున్న ‘2.0’ విషయంలోనూ ఆయనది అదే పంథా. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు అక్షయ్‌కుమార్ విలన్ పాత్ర చేస్తున్నారు. కోట్ల రూపాయల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్లో శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఆ మధ్య ఓ యాక్షన్ సన్నివేశం కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. తాజాగా ఓ యాక్షన్ పార్ట్ కోసం ప్రత్యేకంగా మిలిటరీ ట్యాంకర్లను కొనుగోలు చేశారు. అలాగే ఈ సైన్స్ ఫిక్షన్ కథలో ఉన్నట్టుండి మొబైల్స్ కొరత ఏర్పడే విచిత్రమైన సన్నివేశం కోసం భారీ ఎత్తున ఓ మొబైల్ స్టోర్ సెట్‌ను చెన్నై పరిసరాల్లో వేశారు. మొత్తం మీద శంకర్ రాజీ అనేది లేకుండా తీస్తున్నారన్నమాట.