హంగర్ స్ట్రైక్! | hunger strike | Sakshi
Sakshi News home page

హంగర్ స్ట్రైక్!

Published Wed, Feb 25 2015 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

హంగర్ స్ట్రైక్!

హంగర్ స్ట్రైక్!

తారలపై ఫ్యాన్స్ చూపే అభిమానానికి హద్దులుండవని మరోసారి చూపాడు బాబూభాయ్ శిషాంగియా. ఇతనెవరనేగా..! గుజరాత్‌కు చెందిన సల్మాన్‌ఖాన్ వీరాభిమాని. ఎంతగా అంటే... కండల వీరుడితో ఫొటో దిగాలన్న తన కోరిక నెరవేరే వరకూ అన్నం ముట్టనంతగా! ప్రస్తుతం సూరజ్ బరజాత్యా రూపొందిస్తున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ గుజరాత్ గోండల్‌లో జరుగుతోంది.

ఇదే ప్రాంతవాసి అయిన బాబూభాయ్ విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్నాడు. సల్లూభాయ్‌తో కలసి ఓ ఫొటో దిగే వరకు నిరాహార దీక్షకు దిగాడు. అంతే కాదు... అక్కడకు వచ్చే వారందరినీ ఆపి మరీ తన గోడు హీరోగారికి వినిపించండంతూ వేడుకొంటున్నాడు. అయితే కండల వీరుడికి అభిమానుల నుంచి ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలో కూడా సల్మాన్‌ను చూసేందుకు ఓ వీరాభిమాని బీహార్ నుంచి ముంబైకి సైకిల్‌పై వచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement