తెలంగాణలో గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు
హైదరాబాద్: సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ 'శ్రీమంతుడు' గా నిరూపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పటికే సొంత ఊరు బుర్రిపాలెం దత్తత తీసుకున్న మహేష్, మరో గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాడు.
తెలంగాణ మంత్రి కే తారకరామారావు సలహా మేరకు 'గ్రామజ్యోతి' పథకంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల వెనకబడిన గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకోనున్నట్లు ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. గ్రామజ్యోతి కార్యక్రమం కింద... ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని మంత్రి కేటీఆర్ తనను కోరారని మహేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అందుకే కరువు, వలసల బారిన పడిన మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకుంటాని తెలిపారు. దత్తత తీసుకునే గ్రామం వివరాలను త్వరలో వెల్లడిస్తానన్నారు మహేష్. ఇందుకు కేటీఆర్ స్పందిస్తూ.. 'మీ నిర్ణయం వ్యక్తిగత సామాజిక బాధ్యత విషయంలో చాలా మందికి స్పూర్తిదాయకం' అని కొనియాడారు.
@urstrulyMahesh Thanks Mahesh. May your decision inspire many more people towards Individual Social Responsibility.Let's get this going soon
— KTR (@KTRTRS) August 19, 2015