పాలమూరును దత్తత తీసుకుని ఏం చేశారు? | what devolopment you do taken palamuru guvvala | Sakshi
Sakshi News home page

పాలమూరును దత్తత తీసుకుని ఏం చేశారు?

Published Wed, May 4 2016 4:07 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

పాలమూరును దత్తత తీసుకుని ఏం చేశారు? - Sakshi

పాలమూరును దత్తత తీసుకుని ఏం చేశారు?

చంద్రబాబుపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకుని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఏం ఒరగబెట్టారో.. ఏమేరకు అభివృద్ధి చేశారో తెలపాలని తెలంగాణ టీడీపీ నేతలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. మంగళవారం ఆయన టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించి 90 శాతం పనులు గత పాలకులే పూర్తి చేశారనడం అబద్ధమని, దీనిపై చర్చకు సిద్ధమన్నారు. కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణకు ప్రాజెక్టులపై అవగాహన లేదని, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement