ముంబయి: త్వరలో ముంబయిలో జరగనున్న హాలీవుడ్ పాప్ యువ కెరటం జస్టిన్ బీబర్ నిర్వహించే సంగీత కార్యక్రమ వేదికపై తాను ఉండటం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పష్టం చేసింది. వచ్చే మే నెలలో ముంబయిలో బీబర్ పాప్ గీతాలతో ఉర్రూతలూరించనున్నాడు. ఈ కార్యక్రమంలో సోనాక్షి కూడా పాలుపంచుకోబోతుందంటూ బాలీవుడ్‌లో కోడై కూస్తున్నారు. దీంతో ఇక లాభం లేదనుకున్నా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో
‘ముందుగా మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. బీబర్ కచేరిలో నా ప్రదర్శన లేదు. ఇప్పటికే నేను ఈ విషయం పలు విధాలుగా చెప్పాను. మీడియా ద్వారా కూడా చెప్పాను. నేను పాల్గొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అదంతా కూడా ఊహగానామే’ అంటూ ఆమె తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. తనకు సంగీతం అంటే చాలా ఇష్టం అని, ప్రదర్శన ఇవ్వడాన్ని ఇష్టపడతానని, పాడేందుకు కూడా ఆసక్తి ఉంటుందని చెప్పారు.
బీబర్ వేదికపై నా ప్రదర్శన లేదు: నటి
Published Tue, Apr 25 2017 1:53 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
Advertisement
Advertisement