రత్నంలాంటి అమ్మాయికి మణిలాంటి అవకాశం! | I Want to act in Director Mani Ratnam Movie says Adhita Rao | Sakshi
Sakshi News home page

రత్నంలాంటి అమ్మాయికి మణిలాంటి అవకాశం!

Published Wed, Apr 20 2016 10:47 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

రత్నంలాంటి అమ్మాయికి మణిలాంటి అవకాశం! - Sakshi

రత్నంలాంటి అమ్మాయికి మణిలాంటి అవకాశం!

 మణిరత్నం సినిమాలో అవకాశం అంటే ఏ ఆర్టిస్ట్‌కైనా గోల్డెన్ చాన్స్ అనే చెప్పాలి. స్టార్స్ సైతం ఆయన సినిమాల్లో అవకాశం దక్కితే సంబరపడిపోతారు. ఇక, అప్‌కమింగ్ యాక్టర్స్ అయితే చెప్పక్కర్లేదు. కలా? నిజమా? అని గిల్లి చూసుకుంటారు. ఇప్పుడు బాలీవుడ్ కథానాయిక అదితీ రావ్ హైదరి పరిస్థితి అదే. మలయాళ చిత్రం ‘ప్రజాపతి’ సినిమాతో తెరంగేట్రం చేసిన అదితీరావ్  ఆ తర్వాత ‘సింగారం’ అనే తమిళ చిత్రంలో నటించారు. ‘ఢిల్లీ-6’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
 
 ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించినా ఆమె కెరీర్‌కు బ్రేక్ రాలేదు. ఇలాంటి సమయంలో మణిరత్నం సినిమాకి అవకాశం రావడం అంటే అదితీకి బంపర్ ఆఫర్ దక్కినట్లే. మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా అదితీని తీసుకున్నారు. మొదట ఈ చిత్రంలో ‘ప్రేమమ్’ ఫేమ్ సాయిపల్లవి కథానాయికగా ఖరారైరయ్యారని, కానీ తర్వాత ఆమె తప్పుకున్నారనీ వార్తలు వచ్చాయి.
 
 అయితే సాయిపల్లవి మాత్రం తనకు ఈ సినిమా అవకాశమే రాలేదని, ఒకవేళ వచ్చినా మణిరత్నం సినిమా నుంచి ఎలా తప్పుకుంటానని ట్వీట్ చేశారు. అదృష్టం ఉంటే వెతకబోయే తీగ కాలికి తగులుతుందట. ఇప్పుడు అదితి లక్కీ అన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement