చారుతో డేటింగ్
Published Tue, Nov 26 2013 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువ జంట జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇదే చారుతో డేటింగ్’. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రంలో క్రిష్, స్వప్న జంటగా నటించారు. ఎస్.నాగరాజు దర్శకుడు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత తిరుచ్చి జి.చెల్లాదురై చెబుతూ -‘‘డేటింగ్ అనే ప్రక్రియ సమాజాన్నీ సంస్కృతిని ఎలా నిర్వీర్యం చేస్తోందనేది ఈ కథలో ప్రధానాంశం. సందేశం, వినోదం కలగలుపు ఈ సినిమా. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకు స్పందన బాగుంది. తమిళ, మలయాళ వెర్షన్ల పాటలను విడుదల చేశాం. డిసెంబర్ తొలివారంలో తెలుగు వెర్షన్ పాటలను, అదే నెల రెండో వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి రచన: కనగాల రమేష్‌బాబు, కెమెరా: జగదీశ్-కాళిదాస్, సంగీతం: సి.జార్జ్, నిర్మాణం: నందు ఆర్ట్స్ క్రియేషన్స్.
Advertisement
Advertisement