
స్క్రీన్ టెస్ట్
♦ ‘పోకిరి’ కథను మహేశ్‌బాబు కంటే ముందు పూరి జగన్నాథ్ ఏ హీరోకి చెప్పారో తెలుసా?
ఎ) పవన్‌కల్యాణ్ బి) రవితేజ సి) ప్రభాస్ డి) ఎన్టీఆర్
♦ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగును ఎన్ని రోజుల్లో పూర్తి చేశారో చెప్పుకోండి!
ఎ) 69 బి) 79 సి) 89 డి) 99
♦ సినిమాల్లోకి రాకముందు రాజమౌళి దర్శకత్వం వహించిన సీరియల్ ఏది?
ఎ) శాంతి నివాసం బి) చక్రవాకం సి) అమృతం డి) ఇది కథ కాదు
♦ కాయిన్ కింద పడితే.. లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగితే... విలన్స్‌కి పగిలిపోతుంది! ‘ఖైదీ నంబర్ 150’లో సూపర్ హిట్ కాయిన్ ఫైట్‌ను కంపోజ్ చేసింది ఎవరు?
ఎ) రామ్–లక్ష్మణ్ బి) పీటర్ హెయిన్స్ సి) విజయన్ డి) ‘డ్రాగన్’ ప్రకాశ్
♦ ‘కాటమరాయుడు’లో ‘లాగే మనసు లాగే...’ పాటలో తొలి చరణంలో తొలి వాక్యం ఏది?
ఎ) నీ నవ్వులోన ఉందే ఓ మైకం బి) నీ కళ్లలోన ఉందే ఓ కావ్యం సి) ఏమాత్రం కుదురే ఉండదు ప్రేమాతురాణం డి) ఈడొచ్చిన సీతాకోకై నా మీద వాలి
♦‘ప్రేమమ్’లో లెక్చరర్ క్యారెక్టర్‌కు ఫస్ట్ చాయిస్ శ్రుతీహాసన్ కాదు. మరి, దర్శకుడు చందూ మొండేటి ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎ) సాయి పల్లవి బి) సమంత సి) కాజల్ అగర్వాల్ డి) త్రిష
♦ ఈ నటుడు మహేశ్‌బాబు సోదరి మంజుల భర్త!
ఎ) రావు రమేశ్ బి) సీనియర్ నరేశ్ సి) సంజయ్ స్వరూప్ డి) రమేశ్
♦ పవన్‌కల్యాణ్ ఈ హిందీ హీరోకి ఫ్యాన్!
ఎ) దిలీప్‌కుమార్ బి) రాజ్‌కపూర్ సి) దేవానంద్ డి) అమితాబ్ బచ్చన్
♦ రామాయణం, మహాభారతం వంటి హిందూ పురాణాల స్ఫూర్తితో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తీసిన సినిమా ఏదో తెలుసా?
ఎ) ద అబ్యస్ బి) టైటానిక్ సి) ఘోస్ట్స్ ఆఫ్ ద అబ్యస్ డి) అవతార్
♦ సినిమా షూటింగ్ చేసేటప్పుడు బ్యాగ్రౌండ్‌లో బ్లూమ్యాట్‌ను ఎందుకు ఉపయోగిస్తారు!
ఎ) సీనంతా బ్లూ కలర్‌లో కనిపించడానికి! బి) విజువల్ ఎఫెక్ట్స్ రీప్లేస్ చేయడానికి
సి) స్కై (ఆకాశం) ఎఫెక్ట్ తీసుకురావడానికి! డి) బ్యాగ్రౌండ్‌ను బ్లర్ చేయడానికి!
♦ ఫస్ట్ 25 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్న కత్రినా కైఫ్, ‘మల్లీశ్వరి’ షూటింగ్ సగం పూర్తయిన తర్వాత సినిమా కంప్లీట్ చేయడానికి నిర్మాతల దగ్గర ఎంత ఎక్స్రా›్టఅమౌంట్ డిమాండ్ చేశారో తెలుసా?
ఎ) 40 లక్షలు బి) 50 లక్షలు సి) 60 లక్షలు డి) 70 లక్షలు
♦ ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ దర్శకుడు రాఘవేంద్రరావుకు ఏమవుతారు?
ఎ) మేనల్లుడు బి) కుమారుడు సి) అల్లుడు డి) స్నేహితుడు
♦ మనవడు సుమంత్‌తో కలసి ఏయన్నార్ నటించిన సినిమా?
ఎ) పెళ్లి సంబంధం బి) సత్యం సి) యువకుడు డి) మహానంది
♦ ‘రుద్రమదేవి’లో అనుష్క పెట్టుకున్న నగల ఖరీదు ఎంత?
ఎ) ఐదు లక్షలు బి) యాభై ఐదు లక్షలు సి) రెండున్నర కోట్లు డి) ఐదు కోట్లు
♦ వెంకటేశ్ హీరోగా దాసరి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా?
ఎ) బ్రహ్మపుత్రుడు బి) కలియుగ పాండవులు సి) రక్త తిలకం డి) భారతంలో అర్జునుడు
♦ ‘పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో...’ పాటను రాయడానికి 70 రోజులు పట్టిందట! ఇంతకీ, ఈ పాట రాసింది ఎవరో తెలుసా?
ఎ) రామజోగయ్య శాస్త్రి బి) చంద్రబోస్ సి) సీతారామ శాస్త్రి డి) అనంత శ్రీరామ్
♦ నయనతారకు డబ్బింగ్ చెప్పే ప్రముఖ గాయని ఎవరు?
ఎ) శ్రావణ భార్గవి బి)సునీత సి) గీతా మాధురి డి) చిత్ర
♦ త్రిష కోసం కమల్‌హాసన్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యారు. ఈ సీన్ ఏ సిన్మా షూటింగులో చోటు చేసుకుందో చెప్పుకోండి!
ఎ) చీకటి రాజ్యం బి) మన్మథ బాణం సి) ధర్మయోగి డి) నాయకి
♦ ఈ ఫొటోలోని ప్రముఖ దర్శకుడు ఎవరో గుర్తుపట్టారా?
ఎ) కృష్ణవంశీ బి) వంశీ సి) రామ్‌గోపాల్ వర్మ డి) భారతీరాజా
♦ ఇప్పటి ప్రముఖ హీరోయిన్, ఈ ఫొటోలోని చిన్నారి ఎవరు?
ఎ) అదా శర్మ బి) ప్రణీత సి) సమంత డి) తాప్సీ